బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటే..ఆ జబ్బులు పరార్?!
TeluguStop.com
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు.ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ షెడ్యూల్ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌నే తీసేస్తుంటారు.
మరికొందరు బరువు తగ్గాలనే ఉద్ధేశంతో బ్రేక్ ఫాస్ట్ కు దూరంగా ఉంటారు.కానీ, ఆరోగ్యంగా ఉండాలన్నా.
రోజంతా యాక్టివ్‌గా పని చేయాలన్నా బ్రేక్ ఫాస్ట్ చేయడం అవసరం.అంతేకాదు, తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండటం అంతకంటే ముఖ్యం.
కొందరు ఆకలి తీర్చుకునేందుకు బ్రేక్ ఫాస్ట్‌లో ఏది పడితే అది తింటుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకుంటే.
అనేక జబ్బులను నివారించుకోవచ్చు.మరి ఆ ఫుడ్స్ ఏంటో చూసేయండి.
బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి.అంటే గుడ్డు, పాలు, నట్స్, మొలకలు వంటివి తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది.
ఫలితంగా మీతో పాటు మీ మెదడు కూడా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తుంది.
ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.అలాగే చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధ పడుతుంటారు.
"""/" / కానీ, ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే.
ఎసిడిటీ సమస్య పరార్ అవుతుంది.బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్‌మీల్ ను చేర్చుకోవడం కూడా ఎంతో మంచిది.
ఎందుకంటే, అధిక బరువుని మరియు అధిక ఆకలిని తగ్గించడంలో ఓట్‌మీల్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
బ్రేక్ ఫాస్ట్‌లో బ్రౌన్ బ్రెడ్‌ను కూడా తీసుకోవచ్చు.ఫైబర్ ఫుష్కలంగా ఉండటం వల్ల.
బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పుడుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాడోను కూడా తీసుకోవచ్చు.
అవకాడో ఉండే పోషకాలు నీరసం, అలసట వంటి వాటిని దూరం చేసి.శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఇక వీటితో పాటు జొన్న రొట్టెలు, రాగి దోసెలు, రాగి జావ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇలాంటివి కూడా బ్రేక్ ఫాస్ట్‌లో తినొచ్చు.