దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి.అయితే ఈ సమస్యలను దరి చేరకుండా చేయడంలో కొన్ని కొన్ని ఫుడ్స్‌ను అద్భుతంగా సహాయపడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఆ ఫుడ్స్ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ఓట్స్.
ఇవి చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి.పైగా ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల, వీటిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
దాంతో తరచూ జీర్ణ సమస్యల బారిన పడకుండా ఉంటాయి.అలాగే పెరుగన్నాన్ని రోజూ ఉదయం పూట తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలేవి దరి చేరకుండా ఉంటాయి.
నీరసం, అలసట తగ్గి శరీరానికి ఫుల్ ఎనర్జీ లభిస్తుంది.దాంతో మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
కీరదోస కూడా జీర్ణ సమస్యలను దరి దాపుల్లోకి రాకుండా చేయగలదు.అందు వల్లనే, కీరదోసను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు.
అదే విధంగా, ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే, అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇది జీర్ణ సమస్యలకు అడ్డు కట్ట వేయడమే కాకుండా పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది.
"""/" /
ఇక జీర్ణ వ్యవస్థ పని తీరును రెట్టింపు చేయడంలో అల్లం టీ సూపర్‌గా సహాయపడుతుంది.
అల్లం టీను రోజుకు ఒక కప్పు చప్పున తీసుకుంటే గనుక జీర్ణ సంబంధిత సమస్యలు మీకు దూరంగా ఉంటాయి.