ఈ యంగ్ హీరోలకు మంచి రోజులు వచ్చినట్టేనా..?

ప్రస్తుతం యంగ్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు మరోసారి వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

కొన్ని రోజుల వరకు వీళ్ళకి మార్కెట్ అనేది పెద్దగా లేదు.ఇక గత రోజుల నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ప్లాప్ లు, డిజాస్టర్లు గా మారుతుండటం తో వీళ్లను పట్టించుకునే నాధుడు కూడా లేకుండా పోయాడు.

కానీ ఎట్టకేలకు వీళ్ళు కూడా మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) రీసెంట్ గా ' క ' అనే సినిమా టీజర్ ని రిలీజ్ చేశాడు.

"""/" / ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండటం వల్ల ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మంచి బజైతే క్రియేట్ అవుతుంది.

అయితే ఈ సినిమాతో పాటుగా ఆయన 'దిల్ రూబా' అనే మరొక లవ్ స్టోరీ ని కూడా చేస్తున్నాడు.

ఇక మొత్తానికైతే క సినిమాతో ఒక మంచి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్( Raj Tarun ) కూడా ఇప్పుడు తిరగబడరా స్వామి, పురుషోత్తముడు సినిమాలతో మరోసారి హీరోగా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ రోజు రిలీజైన పురుషోత్తముడు ట్రైలర్ అయితే చాలా బాగుంది.ఇక ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక పెద్ద సినిమాని చూస్తున్న హైప్ అయితే క్రియేట్ అయింది.

ఇక అందులో భాగంగా ఈ సినిమాలో చాలామంది పెద్ద నటులు కూడా నటిస్తున్నారు.

"""/" / ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి దిగ్గజ నటులు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.

ఈ ట్రైలర్ చూసాక ఒక్కసారిగా ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ యంగ్ హీరోలు మొదటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం సక్సెస్ లను అందుకోవడం లో తడబడుతున్నారు.

చూడాలి మరి ఈ సినిమా కొడతారు లేదా అనేది.

అసెంబ్లీ సాక్షిగా..  జగన్ ను ఇలా టార్గెట్ చేస్తున్నారా బాబు ?