మహాశివరాత్రి తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

గ్రహాల రాజు సూర్య భగవానుడు.భూమి పై శక్తికి మూలవనరు.

ఇక బృహస్పతి జ్ఞానం, అభివృద్ధి, అదృష్టానికి మూలంగా చెప్పవచ్చు.అయితే ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశి లోకి ప్రవేశిస్తున్నాయి.

దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలో కలవబోతున్నాయి.మేషరాశిలో ఈ రెండు గ్రహాలు శక్తిని పెంచుతాయి.

ఈ ప్రభావంతో ఈ రాశి ప్రజలు తమ తమ పనులలో విజయం సాధిస్తారు.

వీరు చేసే ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది.వీరికి కార్యాలయాల్లో తగిన గౌరవం లభిస్తుంది.

"""/" / మిధున రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అదృష్టం వరిస్తుంది.

ఇంకా చెప్పాలంటే వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడం వల్ల,వీరి ఆదాయంలో అభివృద్ధి బాగా ఉంటుంది.

మిధున రాశి వారు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి.

ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడున్న దాని కన్నా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

"""/" / సింహ రాశి వారికి తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి.విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఈ గ్రహాల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంది.

అదృష్టం వీరి వెంట ఉంటుంది.సూర్యుడు సింహరాశికి అధిపతి.

అందుకే ప్రతి అంశంలోనూ సానుకూల ఫలితాలు లభిస్తాయి.వీరు జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సు పొందుతారు.

మీన రాశికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అంత శుభమే జరుగుతుంది.

ఈ రాశి వారి ఇల్లు, సంతోషం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.మీరు ఉద్యోగరీత్యా ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది.

ఆర్థికపరమైన కష్టాలు దూరమవుతాయి.ఆర్థికంగా బలపడడమే కాకుండా బంధుమిత్రులలో మీ పరపతి పెరుగుతుంది.

ఫొటో వైరల్: శుభవార్త చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్.. ‘అమ్మానాన్నలు కాబోతున్నాం’ అంటూ..