ఏపీకి మంచి రోజులే ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు.ప్రచారానికి ఈ వారమే చివరివారం కావడంతో.

ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సోమవారం ప్రధాని మోడీ( PM Modi ) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో( Anakapally ) నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ఏపీ అభివృద్ధి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.

దీంతో ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు( Chandrababu ) స్పందించారు. """/" / ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ భరోసా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం.

ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే.కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోడీ, అమిత్ షా వివరించారు.

ప్రజలు గెలవాలి.రాష్ట్రం నిలవాలి.

రాష్ట్రంలో ఎన్డీఏ ( NDA ) గెలుపును ఎవరు అడ్డుకోలేరు.ఈ ఎన్నికలలో అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లటం ఖాయం.

అధికారం ఉందని జగన్ విర్రవీగారు.25 లోక్ సభ, 160 అసెంబ్లీ స్థానాలలో కూటమిదే విజయం అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో సైకో జగన్ పోవాలని సెటైర్లు వేశారు.కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో కూటమి అధికారంలోకి రాబోతుందని చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు.

2025 స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఓజీ, మాడ్ స్క్వేర్ తో పాటు ఆ సినిమాలు!