అమరావతికి మంచి రోజులు ! రుణంపై కేంద్రానికి ప్రపంచ బ్యాంకు లేఖ

అమరావతి( Amaravati )లో రాజధాని నిర్మాణం చేపట్టే విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .

గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతిలో ఎక్కడెక్కడ నిర్మాణాలు నిలిచిపోవడం,  అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించడంతో అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా చేసేందుకు అక్కడ అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసి అభివృద్ధి చేయాలని భావిస్తున్న టిడిపి ,జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సహకారం కూడా తోడైంది.

ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల రుణానికి సంబంధించిన ఆమోదం దాదాపుగా లభించింది.

ఈ మేరకు కేంద్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి లేఖ అందింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏ కు అందనున్నాయి.

"""/" / అలాగే ఏపీకి రుణంగా ఇస్తున్న ఈ మొత్తం లోను కేంద్ర వాటా పైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో 15 వేల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తామని,  ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి లోను పర్యటించారు.ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu )తో పాటు,  సిఆర్డిఏ అధికారులతోనూ సమావేశాలు నిర్వహించారు.

తాజాగా కేంద్రానికి ప్రపంచ బ్యాంకు రాజధాని నిర్మాణం కోసం 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ లేఖ రాసింది .

దీంతో రుణం మంజూరుకు సంబంధించి సంప్రదింపులు మరింత వేగవంతం అయ్యాయి.దీనిలో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో ప్రపంచ బ్యాంకు అధికారులు ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

"""/" /  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తం సీఆర్డీఏకు అందనుంది.అమరావతిలో మౌలిక వసతుల కల్పనతో పాటు, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లే అవుట్ ల అభివృద్ధి , శాసనసభ , హైకోర్టు,  సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాల టవర్ల నిర్మాణానికి 49 వేల కోట్లు ఖర్చు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది.

ఈ నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగియనుంది.ఆ తరువాత రుణం మొత్తం లో 3750 కోట్లు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రపంచ బ్యాంకు ఎడిబి రుణం ఇస్తున్నా,  అది ఏపీ ప్రభుత్వం పనే భారం పడదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తోంది.ఈ రుణంకు 15 ఏళ్ల మారిటోరియం ఉంటుంది.

చెల్లించాల్సిన వడ్డీ నాలుగు శాతం లోపే ఉంటుందని , ఈ రుణంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10% చొప్పున భరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూడకండి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు!