ఏపీలో స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీలు విడుద‌ల‌

స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ ప్ర‌భుత్వం సత్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేసింది.

రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

విడుద‌ల అయిన వారిలో జీవిత ఖైదు ప‌డిన 48 మంది ఖైదీలు కూడా ఉన్నారు.

అయితే, స‌త్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా విడుద‌లైన ఖైదీల్లో ఎక్కువ‌గా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు చెందిన వారే కావ‌డం విశేషం.

జైల్లో కనబర్చిన సత్ప్రవర్తననే బయట కూడా కనబర్చాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపశమనాన్ని రద్దు చేస్తామని ఖైదీలకు అధికారులు తెలిపారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!