గోంగూరను ఇలా తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా పరార్ అవ్వాల్సిందే!

రక్తహీనత.ప్రధానంగా మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంటుంది.

పోషకాహార లోపం, నెలసరి కారణంగా మహిళలు తరచూ రక్తహీనత బారిన పడుతుంటారు.రక్తహీనత కారణంగా నీరసం, ఆయాసం, త్వరగా అలసిపోవడం, కాళ్ళ వాపులు, గుండె దడ, రోగ నిరోధక వ్యవస్థ బలహీన‌పడటం తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.

కాబట్టి రక్తహీనతను అంత తక్కువ అంచనా వేయకూడదు.ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే రక్తహీనతను తరిమికొట్టే సామర్థ్యం గోంగూరకు ఉంది.అద్భుతమైన మరియు అందరూ మెచ్చే ఆకుకూరల్లో గోంగూర ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

గోంగూర లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఆరోగ్యపరంగా గోంగూర అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి గోంగూర ఒక వరం అని చెప్పవచ్చు.మరి గోంగూరను ఎలా తీసుకుంటే రక్తహీనత పరార్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ గోంగూర ఆకులు వేసి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత గోంగూర ఆకులను మెత్తగా పిసికి.అప్పుడు ఆ వాటర్ లో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ గోంగూర నీటిలో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి రోజుకు ఒకసారి సేవించాలి.

ఈ విధంగా గోంగూరను ప్రతి రోజు కనుక తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా దెబ్బ‌కు పరార్ అవుతుంది.

శరీరానికి అవసరం అయ్యే ఐరన్ కంటెంట్ అందుతుంది.హిమోగ్లోబిన్ శాతం చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.

రక్తహీనత నుంచి త్వరగా బయటపడాలనుకునేవారు గోంగూరను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో తీసుకోవడం చాలా ఉత్తమం.

పైగా గోంగూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.

పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సైతం తగ్గుతుంది.

దేవర మూవీ సెన్సార్ టాక్.. బాక్సాఫీస్ వద్ద తారక్ రికార్డులు క్రియేట్ చేయనున్నాడా?