నిద్రలేమికి చెక్ పెట్టే గోంగూర.. ఎలా వాడాలంటే?
TeluguStop.com
గోంగూర.పేరు వినగానే నోట్లో నీళ్లూరుతుంటాయి.
పుల్లగా పుల్లగా ఉండే గోంగూరతో ముఖ్యంగా మన భారతీయులు రకరకాల రెసిపీలు చేస్తుంటారు.
ముఖ్యంగా గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర పప్పు.అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అయితే ఎలా చేసినా గోంగూర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గోంగూర వంటలను ఇష్టపడతుంటాయి.
ఇక రుచిలోనే కాదు.బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ, అనేక జబ్బులను దూరం చేయడంలోనూ గోంగూర అద్భుతంగా ఉపయోగపడుతంది.
ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో చాలా మంది పట్టి పీడిస్తున్న నిద్రలేమి సమస్యను తరిమి కొట్టడంలో గోంగూర గ్రేట్‌గా సహాయపడుతుంది.
నిద్రలేమి కారణంగా ఎందరో నానా ఇబ్బందులు పడుతున్నారు.ఏ పనిపైనా దృష్టి సారించలేకపోతుంటారు.
నీరసం, అలసట, తలనొప్పి వంటి సమస్యలను కూడా నిద్రలేమి తెచ్చిపెడుతుంది.దాంతో తీవ్రంగా విసిగిపోతుంటారు.
"""/"/
అయితే ఇలాంటి వారు గోంగూర ఆకులను శుభ్రం చేసుకుని రసం తీసుకోవాలి.
ఈ రసాన్ని ప్రతి రాత్రి నిద్రకు ముందు నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు సేవించాలి.
ఇలా చేస్తే చక్కటి నిద్ర పడుతుంది.నిద్ర లేమి సమస్య దూరం అవుతుంది.
ఇక గోంగూరతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.తరచూ కీళ్ల నొప్పులతో బాధ పడే వారు గోంగూర తీసుకోవడం చాలా మంచిది.
ఎందుకంటే, గోంగూరలో పుష్కలంగా ఉండే క్యాల్షియం మరియు ఐరన్ ఎముకలను దృఢపరిచి.కీళ్ల నొప్పిలను దూరం చేస్తుంది.
అలాగే మహిళలు తరచూ గోంగూర తీసుకుంటే చాలా మంచిది.ఎందుకంటే, నెలసరి సమయంలో వచ్చే నొప్పిలను నివారించి.
తగిన శక్తిని అందించడంలో గోంగూర ఉపయోగపడుతుంది.పైగా రక్త హీనత సమస్యలను కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?