గోండ్రియాల పల్లె దవఖానా పరిశీలించిన ఎస్ఐ

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలోని పల్లె దవఖానాలో కొందరు ఆకతాయిలు రాత్రి వేళలో మద్యం సేవిస్తూ,అక్కడే మద్యం సీసాలు పడేస్తున్న వైనంపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ స్పందించారు.

మంగళవారం రాత్రి గోండ్రియాల గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పలువురిపై కేసు నమోదు చేశారు.

బుధవారం గోండ్రియాల పల్లె దవాఖానను పరిశీలించి,గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని,ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!