గోలీ సోడాకు బోలెడు చరిత్ర.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..!

గోలీ సోడా లేదా బంటా సోడా లేదా గోటి సోడా అనేది ఒక ఒక కార్బోనేటేడ్ డ్రింక్.

దీనిని నిమ్మకాయ ఫ్లేవర్ తో కూడా తయారు చేస్తారు.ఈ గోలీ సోడా అనేది 19వ శతాబ్దం నుంచి మన భారతదేశంలో ఫుల్ ఫేమస్ అయ్యింది.

ఇప్పటికీ ఈ గోలీసోడా చాలా చోట్ల విక్రయిస్తున్నారు.దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

అలాగే వేసవికాలంలో దాహార్తిని తీరుస్తుంది.అయితే దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది.

ఆ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1872లో ఇంగ్లాండుకు చెందిన ఇంజనీర్, ఇన్వెంటర్ హిరమ్ కాడ్ ఇండియాలో కార్బొనేటెడ్ డ్రింక్స్ అందుబాటులోకి తేవాలనుకున్నారు.

అలా ఆలోచన చేసి కొద్ది రోజుల తర్వాత అతను ఈ సాఫ్ట్ డ్రింక్స్ పేటెంట్ కూడా పొందారు.

ఆపై ఇండియాలో గోలి సోడా తయారు చేయించారు.ఈ సీసా పైభాగంలో ఒక రబ్బర్ వాషర్ ఉంచి.

దాని నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా సోడా గ్యాస్ ఫిల్ చేసేవారు.అలానే సీసాలో నిండుగా కాకుండా కొంత గ్యాప్ ఇచ్చి నీటిని నింపేవారు.

ఆ బాటిల్ లోని గ్యాస్‌ను మెషిన్ ద్వారా పట్టించినప్పుడు గోలీ వాషర్ లోపలికి వెళ్ళి పోతుంది.

ఆ తర్వాత ఒక మార్బుల్‌ను రబ్బర్ వాషర్ మధ్యలో ఉంచేవారు.ఇక ఈ సీసాని కిరాణా షాపులతోపాటు ఇతర దుకాణాలకు కూడా సరఫరా చేసేవారు.

ఇప్పుడు ఈ సోడాలను రకరకాల ఫ్లేవర్స్ తయారు చేస్తూ 5 రూపాయల నుంచి 25 రూపాయల ధరలతో అమ్ముతున్నారు.

ఇదండీ గోలీసోడా వెనుక ఉన్న కథ.

Dasyam Vinay Bhasker : నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజం..: దాస్యం వినయ్ భాస్కర్