ప్రమాద భరితంగా గొల్లపల్లి బస్టాండ్ అంబేద్కర్, గాంధీ విగ్రహాల చౌరస్థా..

ప్రమాద భరితంగా గొల్లపల్లి బస్టాండ్ అంబేద్కర్, గాంధీ విగ్రహాల చౌరస్థా

రాజన్న సిరిసిల్ల జిల్లా: బతుకమ్మ,దసరా పండుగల సందర్భంగా గొల్లపల్లి బస్టాండ్ లోని అంబేద్కర్,గాంధీ విగ్రహాల చౌరస్తా లో పలు పూల,పండ్ల వ్యాపారుల మూలంగా ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ప్రమాద భరితంగా గొల్లపల్లి బస్టాండ్ అంబేద్కర్, గాంధీ విగ్రహాల చౌరస్థా

గొల్లపల్లి బస్టాండ్ లో ప్రజలు, ప్రయాణికుల రద్దీని తీవ్రంగా వున్నా ట్రాఫిక్ కు నియంత్రించే వారు కరువయ్యారు.

ప్రమాద భరితంగా గొల్లపల్లి బస్టాండ్ అంబేద్కర్, గాంధీ విగ్రహాల చౌరస్థా

గ్రామ పంచాయతీ అధికారులకు, స్థానిక నేతలకు గ్రామ పంచాయతీ ఆదాయం పై వున్న శ్రద్ధ రహదారి నీ ఆక్రమించిన,రోడ్డు ప్రక్కనే వ్యాపారాలు చేస్తున్న వారిని తొలగించడంలో గ్రామ పంచాయతీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు న్నాయి.

ప్రజలకు, ప్రయాణికులకు రొడ్డును ప్రక్కనే వ్యాపారాలు చేస్తున్న వారి మూలంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

రహదారి ప్రక్కనే పండ్లు,పూల, కూరకాయల వ్యాపారులతో పాటు పలువురు రొడ్డునూ ఆక్రమించినా గ్రామ పంచాయతీ కార్యదర్శికి, బిల్ కలెక్టరుకు,సిబ్బందికి పట్టడం లేదు.

రహదారి ప్రక్కనే ఆటోలు ,పండ్ల బండ్లు నిలుపడంతో ఇటీవల గొల్లపల్లికి చెందిన మహేష్ అనే యువకుడు కంటైనర్ లారి క్రింద పడి దుర్మరణం చెందాడు.

దీంతో రోడ్డుపై ఆక్రమణలను తొలగించుటకు దండుగా కదిలిన గ్రామ యువకులు,పంచాయతీ అధికారులు రెండు మూడు రోజులు హడావుడి చేసి రోడ్డు ప్రక్క పండ్ల,పూల వ్యాపారులను ,కురకాయల వ్యాపారులను చౌరస్తాలో వ్యాపారాలు చేయకుండా తొలగించారు.

అనంతరం పట్టనట్లు వుండి పోవడంతో రోడ్డుకు నాలుగు మూలల వ్యాపారాలు యదావిధిగా కొనసాగుతున్నాయి.

వ్యాపారులనుశ్రద్ధ చూపక పోవడం తో లారీల క్రింద,వాహనాల ప్రమాదాల మూలంగా ఎందరి ప్రాణాలు పోవలసి వస్తుందో అని ప్రజలు,గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికయినా గొల్లపల్లి గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది రహదారి నీ ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించ వలసిన అవసరం ఎంతయినా వుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి16, ఆదివారం 2025