సూర్యాపేట జిల్లా:బంగారు తెలంగాణాలో ప్రజల బ్రతుకులే కాదు,నడిచే బాటలు కూడా
అతుకుల గతుకులమయంగా తయారయ్యాయని, వర్షం పడితే కానీ,పల్లెల్లో,పట్టణాల్లో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉన్న విషయం తెలుస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగైదు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని రైతు బజార్ ఎదురుగా సద్దుల చెరువు బతుకమ్మ చౌరస్తా వద్ద రోడ్డు బండారం మొత్తం బయట పడింది.
పెద్ద పెద్ద గుంతలమయంగా మారి, నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిత్యం ఈ రోడ్డు నుండి అనేక వాహనలు తిరుగుతుంటాయి.గుంతల్లో నీళ్లు ఉండడంతో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో అర్థం కాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతలమయంగా మారిన రహదారిలో వర్షాలకు నీళ్లు నిండి
ప్రయాణించాలంటే ప్రాణాలమీదకు వస్తుందని వాహనదారులు,ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు ఈ గోతులు మరింత పెద్దవిగా మారుతున్నాయని,ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో జనాలు హడలిపోతున్నారని
అంటున్నారు.
ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారని వాపోతున్నారు.రాత్రి వేళ ప్రయాణం మరి ప్రమాదకరంగా మారిందని,పదే పదే ఆ దారుల్లో ప్రయాణించడం వల్ల ప్రయాణికుల నడుము నొప్పి బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ
రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పోకిరి సినిమా కోసం పూరీ దగ్గర ఆ స్టార్ డైరెక్టర్ పని చేశారా.. ఈ విషయం మీకు తెలుసా?