ప్రభాస్ సినిమాలో నటించేందుకు సువర్ణ అవకాశం.. ఇందుకోసం ఏం చేయాలంటే.. ??

సినిమా ప్రపంచం ప్రతి వారికి అందమైన రంగుల లోకం.ఇక్కడ నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు.

అందులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోతో నటించే అవకాశం ఉందంటే క్యూ కడతారు.

అది నిజమా, అబద్దమా అని అసలు పట్టించుకోరు.అందుకే ఇక్కడ మోసాలు కూడా జరుగుతుంటాయి.

ఇలాంటి ఒక మోసమే ప్రస్తుతం జరిగిందట.అది కూడా ప్రభాస్ పేరు చెప్పుకుని.

ఆ వివరాలు తెలుసుకుంటే.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించేందుకు సువర్ణ అవకాశమని, ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోండి అంటూ ఓ ముఠా ఒక ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రకటన విడుదల చేసిందట.

ఇంకేముంది ఆ ప్రకటన చూసిన వారు వారిని సంప్రదించగా, ముందుగా మీ పేరు నమోదు చేసుకోవాలని, ఇందు కోసం కొంత డబ్బులు కట్టాలని సూచించారట.

ఇక ప్రభాస్ సినిమాలో అవకాశం అనేసరికి ఔత్సాహికులు ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును చెల్లించగా, ఆ మోసగాళ్లూ కొన్ని రోజుల్లో మా కంపెనీ నుంచి మీకు మెసేజ్ వస్తుందని, సిద్దంగా ఉండాలని చెప్పారట.

కానీ ఎన్ని రోజులు గడిచిన ఆ మెసేజ్ రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన వారు పోలీసులను ఆశ్రయించారట.

కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబై కేంద్రంగా జరిగిన ఈ మోసం పై విచారణ చేపట్టారట.

ఇక ప్రతి వ్యక్తి నుండి దాదాపు ఐదు వేల నుంచి పదివేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.