మార్షల్ ఆర్ట్స్ లో నేరేడుచర్ల బుడతడికి గోల్డ్ మెడల్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్ రెడ్డి ఈనెల 28న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్-2024 20 కిలోల విభాగంలో గోల్ద్ మెడల్ సాధించి,ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
అల్కాపూర్ టౌన్ షిప్ లోని స్కాలర్స్ అకాడమిలో 3వ తరగతి చదువుతూ,టౌన్ షిప్ లో ఉన్న కోచ్ సైకం సుబ్బారావు ఎస్ఐ టిఎస్ సంస్థలో శిక్షణ పొందుతున్నాడు.
గతంలో జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయి పథకాలు సాధించాడు.ప్రస్తుతం ప్రపంచ స్థాయి పోటీలకు సన్నద్ధం అవుతున్నాడు.
గమన్ రెడ్డి నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, విజయలక్ష్మిల మనుమడు కావడం విశేషం.
చిన్నారి విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఉదయ్ కుమార్ రెడ్డి,శోభన కుటుంబ సభ్యులు, ఇనిస్ట్యూట్ నిర్వాహకులు తదితరులు అభినందనలు తెలిపారు.
నేరేడుచర్ల పట్టణంలోనూ గమన్ రెడ్డి కి పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?