వంటగదిలో వరించిన అదృష్టం... కోట్ల విలువచేసే బంగారు నాణేలు దొరికాయి!

అదృష్టం వరిస్తే బికారి కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు అనే నానుడి కొంతమంది విషయాలలో నిజమై తీరుతుంది.

అవును, UKలోని పదేళ్లుగా నివాసం ఉంటున్న ఒక ఇంటిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.

శ.1700 ప్రారంభ కాలానికి చెందిన గోల్డ్‌ కాయిన్స్‌ బయట పడ్డాయి.

దాంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొదట వాటిని అమ్మితే సుమారు రూ.

2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) వస్తాయని అనుకున్నారు.

అయితే వారి అంచనా తప్పయింది.అవును, వారు ఆ బంగారు నానేలను స్థానికంగా వున్న పురావస్తు శాస్త్రవేత్తల దగ్గరకు తీసుకెళ్లగా మూడింతలు అంటే సుమారు రూ.

7 కోట్లు ఆ సంపద ధర పలికిందని చెప్పుకొచ్చారు అధికారులు.విషయం ఏమంటే, వాటిని లండన్‌కు చెందిన వేలం సంస్థ స్పింక్‌ అండ్‌ సన్‌ ప్రతినిధి గ్రెగరీ వేలం వేశారు.

దాంతో ఆ నిధి ఆ ధర పలికిందని సదరు సంస్థ ఎడ్‌మండ్‌ తెలిపారు.

ఆ నాణేలు ఫెర్న్‌లీ-మాయిస్టర్స్‌ కాలానికి చెందినవి కావడంతో కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు.

కాగా ఆ సంపదని ఎవరికీ చెప్పకుండా అమ్మేయకుండా అలా తెచ్చి ఇచ్చినందుకు వారిని అభినందించారు.

"""/"/ సదరు వేలంలో 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన సంపద కావడంతో వాటిని చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారట.

ఒకరిని మించి ఒకరు వాటిని కొనుక్కునేందుకు ఆశ చూపగా ఆ మొత్తం ఫిక్స్ అయిందని అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు.

కాగా ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం వలన ఆ నిధి దొరికిన ఇంటి యజమానులు చాలా సంతోషించారు.

అయితే ఆ వచ్చిన మొత్తంలో 30% టాక్స్ రూపంలో ప్రభుత్వం తీసుకోగా మిగిలినది వారికి ఇవ్వనున్నారు.