ఇదేందయ్యా ఇది.. తీసేకొద్దీ బంగారం, డబ్బులు (వీడియో)
TeluguStop.com
సోషల్ మీడియాలో తరచుగా రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.సీలింగ్ పై కొండచిలువలు కనిపించటం, ఇంకా పలు చోట్ల విచిత్రమైన ఆకారాలు రావడం వంటి వీడియోలు నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తుంటాయి.
తాజాగా ఇలాంటి మరో విచిత్రమైన ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పనుల నిమిత్తం బాత్రూం గోడ( Bathroom Wall ) బద్దలు కొట్టే సమయంలో కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు అక్కడ ఏమైంది అంటే. """/" /
వైరల్ వీడియో( Viral Video ) ప్రకారం, ఒక వ్యక్తి బాత్రూమ్ గోడను సుత్తితో పగలగొడుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
టైల్స్‌ను ఒక్కొక్కటిగా పగలగొడుతుండగా, లోపల కన్పించిన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది.గోడలో కుప్పలుగా ఉన్న బంగారు నాణేలు( Gold Coins ) వీడియోలో కనపడుతాయి.
టైల్స్ పూర్తిగా తొలగించిన తర్వాత, ఆ నాణేల వెనుక ఒక ఇనుప లాకర్ కూడా కనిపిస్తుంది.
ఆ ఇనుప లాకర్ ను( Iron Locker ) తెరవడానికి కీ కోడ్ అవసరమవుతుంది.
ఎన్నిసార్లు ప్రయత్నించినా అది తెరుచుకోదు.దీంతో, ఆ పెట్టెను బద్దలు కొట్టేందుకు రెండు లేదా మూడు ఇటుకలు వాడతాడు.
"""/" /
చివరికి ఆ పెట్టె డోర్ వంగిపోవడంతో లోపల ఏముందో చూస్తాడు.
లోపల కుప్పలుగా కరెన్సీ నోట్లతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, నగదు, మొబైల్ ఫోన్, చిన్న తుపాకీ కూడా కనిపించాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, నెటిజన్లు వరుసగా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇదంతా స్టంట్‌లా అనిపిస్తోందని కొందరు అంటుండగా.వ్యూస్, లైకుల కోసం కావాలనే ఇలా ప్లాన్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరు ఇది నకిలీ బంగారం అని అభిప్రాయపడ్డారు.ఇంకెందుకు ఆలస్యం.
మీరు కూడా వీడియోను చూసి మీకేం అనిపించిందో ఓ కామెంట్ చేయండి.
వైరల్ వీడియో : కోహ్లీ నువ్వేమి అసలు మారలేదుగా.. హర్భజన్‌ను ఆటపట్టిస్తూ డాన్స్