వారంలో ఏ పూలతో ఏ దేవునికి పూజ చేయాలో తెలుసా?
TeluguStop.com
ప్రతి రోజు ఉదయం లేవగానే మన కార్యకలాపాలు ముగించుకొని, స్నానం చేసి దేవునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ప్రతిరోజు దేవునికి వివిధ రకాల పూలతో పూజిస్తారు కానీ,ఏ రోజు ఎటువంటి పూలతో పూజ చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు.
అయితే ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం.
*శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు సోమవారం.ఆ శివుని అనుగ్రహం మనమీద కలగాలంటే మారేడు దళాలతోనూ, తెల్లని పుష్పాలతో పూజ చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది.
"""/" /
*ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం.ఈ రోజున స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది.
*వినాయకుడిని, అయ్యప్ప స్వామిని పూజించే రోజు బుధవారం.తెల్ల జిల్లేడు, గరిక, ఎర్ర గన్నేరు పుష్పాలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
*h3 Class=subheader-styleసాయిబాబాకి/h3p, లక్ష్మీ నరసింహ స్వామికి ఇష్టమైన రోజు గురువారం.ఈ రోజు స్వామివారి అనుగ్రహం కలగాలంటే పసుపు పచ్చని పూలతో పూజ చేయాలి.
*సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం.అమ్మవారిని ఎర్రటి మందారాలతో పూజించడం వల్ల ఆమె అనుగ్రహం మనమీద కలిగి సిరిసంపదలను కలుగజేస్తుంది.
*కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం.
ఈ రోజున స్వామివారికి తులసి మాలతోనూ, నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల వారి అనుగ్రహం పొందగలుగుతాము.
అలాగే నవగ్రహాలను కూడా నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి.
*ఆ సూర్యభగవానుని రోజు ఆదివారం.సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించడం వల్ల ఎంతో మంచిది.
ఈ విధంగా ప్రతి రోజు ఇష్టమైన దేవుళ్లకు ఇష్టమైన పువ్వులతో పూజ చేయటం వల్ల ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలను కలిగి ఆనందంగా గడుపుతారు.
సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…