బిస్లరీ బాటిల్ పై గాడ్ ఫాదర్.. భారీ డీల్ కుదుర్చుకున్న బిస్లరీ!
TeluguStop.com
సాధారణంగా ఒక సినిమాని పూర్తి చేసిన తర్వాత ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లాలంటే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంటారు.
ఇలా సినిమాని ఏ స్థాయిలో అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తాము అదే స్థాయిలో సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పాలి.
ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.
మలయాళంలో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న లూసీ ఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా మోహన్ రాజా తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించారు.విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడం కోసం నిర్మాతలు సరికొత్త ప్రయత్నం చేశారు.
"""/"/
ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమా నిర్మాతలు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రముఖ బిస్లరీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే బిస్లరీ వాటర్ బాటిల్ పై గాడ్ ఫాదర్ బొమ్మతో కూడిన లేబుల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా బిస్లరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిల్లపై గాడ్ ఫాదర్ లేబుల్ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఇలా చేయటం వల్ల రెండు సంస్థలకు ఆశించిన స్థాయిలో మార్కెటింగ్ లభిస్తుందని ఈయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!