ఈ పుణ్యక్షేత్రంలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట..!
TeluguStop.com
పూరి జగన్నాథుని రథయాత్ర ( Puri Jagannath )జూన్ 20వ తేదీన మధ్యాహ్నం నుంచి మొదలైంది.
జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చారు.
దేశంలోని 7 మోక్ష దాయక క్షేత్రాలలో పూరీ పుణ్యక్షేత్రం ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
అలాగే సోదరుడు బలభద్రుడితో సోదరి కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు.పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి పుణ్యక్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నిలాచలం, నీలాద్రి( Shankha Kshetra, Nilachalam, Niladri ) అనే పేర్లు కూడా ఉన్నాయి.
"""/" /
సంవత్సరం పాటు గర్భాలయంలో కొలువు దీరి ఉండే జగన్నాథుడి రథయాత్ర జరిగే రోజున తన సోదరీ సుభద్రా, సోదరుడు బలభద్రుడితో కలిసి రథం అధిరోహిస్తాడు.
ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారికి నివేదించే వంటకాలను సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవి( Goddess Mahalakshmi ) అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందని భక్తులు చెబుతున్నారు.
అందుకే అక్కడి ప్రసాదాలకు అంత రుచి ఉంటుందని ప్రజలు నమ్ముతారు.172 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయంలో వంటగది ఒక ఎకరంలో విస్తరించి ఉంటుంది.
ఇందులో 32 విశాలమైన వంట గదిలు ఉన్నాయి.ఒక్క వంటగది పొడుగు 150 అడుగులు, 100 అడుగుల వెడల్పు, ఎత్తు 20 అడుగులు ఉంటాయి.
ఇందులో 500 మంది వంట చేసేవారు.300 మంది సహాయకులు విధులు నిర్వహిస్తూ ఉంటారు.
ఇక్కడ 700 మట్టికుండలతో వంటలు వండుతారు.వాటిని అట్కా అని కూడా పిలుస్తారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీమహావిష్ణువు అర్ధాంగి లక్ష్మీదేవి అదృశ్యంగా పర్యవేక్షిస్తుందని భక్తులు నమ్ముతారు.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే రోజుకు 70 క్వింటాళ్ల బియ్యం ఇక్కడ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
అలాగే ప్రతిరోజు కొత్త పాత్రలను మాత్రమే ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తారు.అలాగే వంటలు పూర్తయ్యాక మొదటిగా భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదం అందిస్తారు.
జగన్నాథుడి సన్నిధిలో పది రోజులపాటు జరిగే ఈ రథయాత్రకి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.
మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్..?