వేప చెట్టుపై వెలసిన అమ్మవారు.. భారీగా తరలి వెళ్తున్న భక్తులు ఎక్కడంటే..

ఈ భూమి మీద ప్రతి రోజు ఎన్నో విచిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

ఏలియన్ ఆకారంలో కొన్ని జంతువులు పుట్టడం, భారీ పాముల హల్ చల్, ఈ మధ్యకాలంలో చెప్పులు ఎత్తుకుపోతున్న పాములు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు భూమిపై జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది.వేప చెట్టుకు అమ్మవారి ఆకారం కనబడడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే జమ్ములమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

కర్నూలు జిల్లా బనగానపల్లె తెలుగు పేటలోని పాత బావి దగ్గర వేప చెట్టుకు ఈ ఆశ్చర్య మైన ఘటన జరిగింది.

చెట్టు మొదటి భాగంలో అమ్మవారి రూపంతో ఆకారం ఏర్పడి అక్కడి ప్రజలకు కనిపించింది.

ఆ వెంటనే అక్కడి ప్రజలలో భయంతో పాటు భక్తి భావం కూడా ఏర్పడింది.

తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పు అమ్మగా భావించి జమ్ములమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ అమ్మవారి ఆకారం ఏర్పడిన చోట భక్తిశ్రద్ధలతో పసుపు, కుంకుమలు రాసి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు.

"""/"/ వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన వింత ఘటన ఆ గ్రామంలోని ప్రజలందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలందరూ తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతులు ఇచ్చి ప్రత్యేకమైన పూజలు చేస్తూ మొక్కుకుంటున్నారు.

ఇంకా చెప్పాలంటే వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడి హాట్ టాపిక్ గా మారినా ఈ వేప చెట్టును గత కొద్ది నెలల క్రితం చెట్టు పై భాగాన్ని రంపం తో కోసి తొలగించారు.

చెట్టును కోసి వేయడం వల్ల వేప చెట్టుపై అమ్మవారు దర్శనమిచ్చారు అనే ప్రచారం కూడా అక్కడి ప్రజలలో జరుగుతూ ఉంది.

వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన ఘటన చెట్లను నరికి వేయొద్దని సందేశాన్ని అమ్మవారు స్పష్టంగా చెబుతున్నారని ఈ భక్తులు నమ్ముతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో టాప్ హీరో అతనే.. వాళ్లు సైతం అంగీకరించారుగా!