ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి త‌గ్గుముఖం

తూర్పుగోదావ‌రి జిల్లా ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ వ‌ద్ద నాలుగు రోజులుగా నిల‌క‌డ‌గా ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది.

సోమ‌వారం సాయంత్రం నాటికి నీటిమ‌ట్టం 14.30 అడుగుల‌కు చేరుకుంది.

కాట‌న్ బ్యారేజ్ నుంచి 13,65,646 క్యూసెక్కుల నీరు స‌ముద్రంలోకి ప్ర‌వ‌హిస్తోంది.అటు భ‌ద్రాచలం వ‌ద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను ఉప స‌హ‌రించారు అధికారులు.

అటు ఉప న‌దులు ప్రాణ‌హిత, ఇంద్రావ‌తి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తూ ఉండ‌డంతో గోదావ‌రి నీటిమ‌ట్టం మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విచారణపై ఉత్కంఠ