లోకరక్షకుడు భగవంతుడు ..మాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక.

రాజన్న సిరిసిల్ల జిల్లా: లోకరక్షకుడు భగవంతుడు అని జగిత్యాల శ్రీ మాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక ( Shri Man Nambi Venugopala Charya Kausika ) అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం లో శ్రీ శోభకృత్ సంవత్సర అధిక శ్రావణ పురుషోత్తమ మాస దివ్య ప్రబోధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సర్వ పురాణ సారం శ్రీ విష్ణు సహస్రనామ వైభవ ప్రవచనం చేశారు.

సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రభాతభేరి, గీతా పారాయణం, సూర్య నమస్కార కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు.

వారికి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు మధ్యాహ్నం భోజన వసతులు ఏర్పాటు చేశారు.

అందమైన చీర కట్టుకుని రష్యా వీధుల్లో తిరిగిన భారతీయ యువతి.. వీడియో వైరల్!