గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్‌ అనుమానాలపై ఫుల్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్ సినిమా విడుదల పై కొందరిని ఇంకా అనుమానాలు ఉన్నాయి.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకపోవడంతో దసరాకి సినిమాను విడుదల చేస్తారా లేదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన పోస్టర్ మరియు షేర్ చేసిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే సినిమా తప్పకుండా దసరా కానుకగా సినిమా రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటి వరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి మీడియా ముందుకు సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.

ప్రస్తుతం వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న మెగాస్టార్‌ చిరంజీవి రెండు రోజుల్లో ఆ షెడ్యూల్‌ ను ముగించబోతున్నాడు.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పనులు ఆపేసి గాడ్‌ ఫాదర్ యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఈ సినిమా లో కీలక పాత్రలో నటించిన నయనతార ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరు అవ్వబోతుందా లేదా అనే విషయంలో చాలా ఆసక్తి వ్యక్తం అవుతోంది.

సాదారణంగా అయితే నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాదు.కానీ పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో తక్కువ నటిస్తూ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా హాజరు అవ్వాలని ఆమె భావిస్తుంది.

అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఓకే చెప్పిందని ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తే తప్పకుండా సినిమా కు మంచి హైప్ వస్తుందని అంటున్నారు.

అక్టోబర్ 5వ తారీకున సినిమా విడుదలకు తగ్గట్లుగా ఈ లోపు ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్లాన్‌ అంతా జరిగి పోయింది.

Karamba Review And Player Reputation — A Practical UK Guide