గాడ్ ఫాదర్ కు ఆ థియేటర్లు దక్కకుండా కుట్ర జరుగుతోందా.. ఏమైందంటే?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలే దసరాకు రిలీజవుతున్న పెద్ద సినిమాలు కావడంతో మెయిన్ థియేటర్లను ఈ రెండు సినిమాలకే కేటాయించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే మొదట ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.నైజాం ఏరియాలో ఈ సినిమా హక్కుల కోసం మొదట దిల్ రాజు శిరీష్ ప్రయత్నించారు.

అయితే ఆ సమయంలో నిర్మాతల ఆలోచన వేరే విధంగా ఉండటంతో గాడ్ ఫాదర్ హక్కులను విక్రయించడానికి నిర్మాతలు ఆసక్తి చూపలేదు.

ఆ తర్వాత మరో డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 22 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.

ఈ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ సహాయంతో నైజాంలో గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

"""/" / అయితే తమకు కాకుండా గాడ్ ఫాదర్ నిర్మాతలు మరో డిస్ట్రిబ్యూటర్ కు హక్కులు విక్రయించడం విషయంలో దిల్ రాజు, శిరీష్ కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

సుదర్శన్ లాంటి మెయిన్ థియేటర్ ను గాడ్ ఫాదర్ కు ఇవ్వకుండా తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం గాడ్ ఫాదర్ కు సుదర్శన్ థియేటర్ దక్కదని సమాచారం అందుతోంది.

మరికొన్ని థియేటర్ల విషయంలో కూడా ఇదే విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంది.

చిరంజీవి లేదా చరణ్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది.

ఆచార్య సినిమా రిలీజ్ సమయంలో కూడా దిల్ రాజు, శిరీష్ విషయంలో ఈ తరహా కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.

చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?