గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకుడిగా ఫస్ట్ ఛాయిస్ మోహన్ రాజా కాదా.. మరెవరంటే?

మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 సైరా నరసింహారెడ్డి ఆచార్య వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమాలు ఏవి ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయాయి.

ఇకపోతే ఈ ఫ్లాపులు అనంతరం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలై ఇప్పటికీ థియేటర్లలో అద్భుతంగా రన్ అవుతుంది.

పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడిగా ముందు మోహన్ రాజాను అనుకోలేదట.

ఈ సినిమా రైట్స్ కొన్న తర్వాత ఈ సినిమాకు దర్శకుడిగా క్రియేటివ్ డైరెక్టర్,మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారిని తీసుకోవాలని చిత్ర బృందం భావించినట్టు తెలుస్తోంది.

అయితే సుకుమార్ పుష్ప 2సినిమా పనులలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని చేసే అవకాశం లేకపోవడంతో అనంతరం ఈ సినిమా అవకాశం మోహన్ రాజా వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక ఈ సినిమాని కనక సుకుమార్ కనుక చేసి ఉంటే ఈ సినిమా విజయం మరోలా ఉండేదని ఈ సినిమా ఇంతకుమించి హిట్ అందుకునేది అని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సత్యదేవ్ వంటి పలువురు స్టార్ సెలబ్రిటీలు నటించడం కూడా ఈ సినిమాకి ఎంతో హైలైట్ అయింది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి నయనతారకు తండ్రిగా నటించిన సర్వదామన్ బెనర్జీ నటన కూడా ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..