ఓనర్ ను హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చిన మేక.. చంపొద్దన్న ఆవేదన

ప్రేమ అనేది మనుషులకే ఉంటుంది అనుకుంటే పొరబడినట్లే.మనుషుల కంటే కూడా జంతు జాతుల్లో ప్రేమానురాగాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అవి ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే జీవితాంతం వదిలి పెట్టవు.ఎంతో విశ్వాసంగా ఉంటాయి.

యజమానికి చాలా నమ్మకంగా ఉంటాయి.వాటి ప్రేమలో స్వార్థం ఉండదు.

మోసం ఉండదు.యజమానికి ఏదైన జరిగితే విలవిల్లాడిపోతాయి.

తమ ఓనర్ కు ఏది జరగకుండా చూసుకుంటాయి.ఇదిగో ఈ మేక అచ్చంగా అలాంటిదే.

తన యజమాని వద్ద ఎన్నో రోజులుగా ఉంటోంది.ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ యజమాని తన ఆర్థిక అవసరాల కోసం దానిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

అంగట్లోకి వచ్చి దానిని వేలం వేశాడు.ఆ సమయంలో ఆ మేక యజమానిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

నన్ను వేరొకరికి అమ్మవద్దు అనే ఆవేదన కనిపించింది.చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్లే ఏడ్చింది ఆ మేక.

 ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలా మంది అయ్యే పాపం అని స్పందిస్తున్నారు.

మాట్లాడలేని ఆ జంతువుకు యజమాని అంటే ఎంత ప్రేమో అని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

యజమాని నుండి అలా దూరం చేసినప్పుడు కొన్ని జంతువులు చాలా బాధను వ్యక్తం చేస్తాయని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఆ మేక అలా ఏడుస్తుంటే దానిని అమ్మడానికి ఆ యజమానికి మనసు లేదా అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఆ మేక బాధను చూస్తుంటే మాత్రం ఎవరైనా బాధ పడాల్సిందే.