రేపు బీఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్..!
TeluguStop.com
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది.
ఈ మేరకు రేపు ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
రేపు ఉదయం 11.30 గంటలకు ఎర్రవల్లి ఫాం హౌస్ లో కాసాని గులాబీ కండువా కప్పుకోనున్నారు.
కాగా కాసానిని గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని గులాబీ బాస్ కేసీఆర్ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
అయితే తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదన్నఅధిష్టానం నిర్ణయంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
“పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!”.. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!