జీమెయిల్‌ స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తుందా? అన్నింటినీ ఒకేసారి ఇలా డిలీట్ చేసేయొచ్చు!

గూగుల్ జీమెయిల్( Google Gmail ) ఖాతాదారులకు కేవలం 15GB గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌ను మాత్రమే ఫ్రీగా అందిస్తుంది.

అయితే ఈ డేటా స్పేస్‌ను ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ అనేవి చాలా వరకు ఆక్రమిస్తూ ఉంటాయి.

దీంతో 15GB స్టోరేజ్ లిమిట్ అనేది చాలా త్వరగా రీచ్ అయిపోతూ ఉంటుంది.

దాన్ని దాటి స్పేస్ కావాలనుకునేవారు ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది.అంటే గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయమని అడుగుతుంది.

అయితే స్పేస్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి బదులుగా యూజర్లు ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ డిలీట్ చేసుకొనే వీలుంది.

వీటిని ఒకేసారి డిలీట్ చేయగల సదుపాయాన్ని కూడా గూగుల్ అందిస్తోంది. """/" / దీనికోసం మీరు ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న 'కేటగిరీస్‌' ( Categories )ట్యాబ్‌కు వెళ్లి ప్రమోషన్స్‌ కేటగిరీని సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.

ఒక్కోసారి ఇన్‌బాక్స్ పైన కూడా ప్రమోషన్స్‌ కేటగిరీ కనిపిస్తుంది.దానిని కూడా సెలక్ట్ చేసుకోవాలి.

ఆ తరువాత కంపోజ్ బటన్‌కు ఎదురుగా కుడి వైపు భాగంలో ఉన్న చెక్‌బాక్స్‌పై క్లిక్ చేస్తే అప్పుడు ప్రస్తుత పేజీలోని అన్ని ఈ-మెయిల్స్‌ సెలక్ట్ అవుతాయి.

అన్ని పేజీలలోని ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడానికి, లిస్టెడ్ ఈమెయిల్‌ల పైన కనిపించే సెలెక్ట్ ఆల్ కన్వర్జేషన్స్‌ ఆప్షన్‌పై ( Select All Conversions Option )ట్యాప్ చేయాలి.

ఇపుడు అన్ని కన్వర్జేషన్స్‌ లేదా ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ సెలక్ట్ చేసిన తర్వాత, డిలీట్ బటన్‌పై నొక్కాలి.

"""/" / ఆ తరువాత ఈమెయిల్స్ సంఖ్యను బట్టి, జీమెయిల్ వాటన్నింటినీ తొలగించడానికి కొన్ని సెకన్లు సమయం తీసుకుంటుంది.

ఆ తర్వాత, ట్రాష్ ని కూడా ఖాళీ చేయవలసి ఉంటుంది.లేదంటే స్పేస్ ఖాళీ కాదు.

ఆ తరువాత గాని ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ విజయవంతంగా క్లియర్ కావు.ఇపుడు మీకు జీమెయిల్‌లో కావలసిన స్పేస్ లభిస్తుంది.

ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ తొలగించడానికి పైన పేర్కొన్న మెథడ్ సమర్థవంతంగా పనిచేస్తుంది.అయితే దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది.

అదేంటంటే, ప్రమోషనల్ ఈ-మెయిల్స్‌ కానివి కూడా ఈ కేటగిరీ కిందికి వస్తే అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి.

ఈ రిస్కు వద్దనుకుంటే, యూజర్లు ముఖ్యమైన వాటి నుంచి జంక్ ఈ-మెయిల్‌లను వేరు చేసుకోవడం మంచిది.