ముఖం అందంగా కనిపించాలంటే.పెదాలు కూడా ఎర్రగా, కాంతివంతంగా ఉండాలి.
కానీ, కొందరి పెదాలు మాత్రం నల్లగా, డ్రైగా మరియు అందహీనంగా ఉంటాయి.దీంతో పెదాలను అందంగా మార్చుకునేందుకు ఎంతో ఖరీదైన లిప్ స్టిక్స్, మార్కెట్ లోంచి తెచ్చుకున్న బామ్స్ వంటివి వాడుతుంటారు.
అయినప్పటికీ, ఫలితం లేకుంటే మాత్రం తెగ బాధ పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే మాత్రం మీ పెదాలు అందంగా నిగనిగలాడం ఖాయం.
మరి ఆ చిట్కాలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని.
అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.రబ్ చేయాలి.
అనంతరం చల్లటి నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.
పెదాలపై మృతకణాలు పోయి మృదువుగా, నిగనిగలాడుతూ కనిపిస్తాయి. """/"/
పాలు మరియు పసుపు కాంబినేషన్ కూడా పెద్దాలను కాంతివంతంగా మారుస్తాయి.
అందువల్ల, ఒక బౌల్‌లో పసుపు మరియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో పెదాలను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేసినా పెదాలు అందంగా, ప్రకాశవంతంగా మారతాయి.
"""/"/
అలాగే గులాబీ రేకులు కూడా పెదాల నిగారింపు పెంచడంలో సూపర్‌గా సహాయపడతాయి.
కాబ్టిటి, కొన్ని గులాబీ రేకులను పెరుగులో కాసేపు నానబెట్టి.పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై.బాగా ఆరిపోనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల.
నల్లగా పెదాలు ఎర్రగా మారడంతో పాటు నిగనిగలాడుతూ కనిపిస్తాయి.
అదిరిపోయే రికార్డు కొట్టాడు భయ్యా.. 38 గంటలు బొమ్మలా నిలబడి ప్రపంచాన్ని షాక్..!