ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యాతిధిగా హాజరై జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పించి,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, జెడ్పిచైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్ రావు,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!!