క్యాపిటల్‌ ఫుడ్‌ కోసం క్యూ కట్టిన గ్లోబల్‌ కంపెనీలు… ఏంటి విషయం?

దేశీయంగా చింగ్స్ ( Chings )సీక్రెట్ బ్రాండ్ తో ఫుడ్ బిజినెస్ చేస్తున్న క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్( CAPITAL FOODS PRIVATE LIMITED ) తన వ్యాపారం మొత్తాన్ని తాజాగా అమ్మకానికి పెట్టగా దానిని కొనుగోలు చేయడానికి ఇండియాలోని ప్రఖ్యాత సంస్థలతో పాటు గ్లోబల్ కంపెనీలు కూడా పోటీ పడడం మార్కెట్ వర్గాలని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి.

తుది బిడ్డర్స్ లిస్టులో టాటా గ్రూప్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ గ్రూప్ అయినటువంటి నెస్లే( Nestlé), ప్రపంచంలోని ఐదో అతి పెద్ద ఆహార & పానీయాల కంపెనీ క్రాఫ్ట్ హీంజ్, అదేవిధంగా నార్వేకి చెందిన MTR & ఈస్టర్న్, కాండిమెంట్స్ పేర్లతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారం కొనసాగిస్తున్న ఓర్ల్కా తదితర కంపెనీలు దానిని కొనడానికి గట్టి పోటీనే ఇస్తున్నాయి.

"""/" / అంతేకాకుండా జపాన్ కి చెందినటువంటి అతి పెద్ద నూడిల్ ఫుడ్ కంపెనీ నిస్సిన్ ఫుడ్స్ కూడా దానిని కొనుగోలు చేయడానికి ఆరాటపడుతోదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే క్యాపిటల్ ఫుడ్లోని ముగ్గురు ప్రధాన ఇన్వెస్టర్లు, తమ వాటాను విక్రయించాలని గత ఏడాదే నిర్ణయించుకున్నారు.

ఆ మూడు ప్రధాన వాటాదార్లు ఎవరంటే.యూరప్ కి చెందిన ఇన్వస్ గ్రూప్ (40 శాతం), US ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ జనరల్ అట్లాంటిక్ (35 శాతం), క్యాపిటల్ ఫుడ్ చైర్మన్ అజయ్ గుప్తా (25 శాతం).

ఈ కంపెనీ, భారతదేశంలో సూప్, నూడిల్స్, మసాలాలు, కర్రీ పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, సాస్లు, బేక్డ్ బీన్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది.

"""/" / ఇకపోతే భారత్ సహా ప్రపంచంలోని పెద్ద ఫుడ్ కంపెనీలు క్యాపిటల్ ఫుడ్ కొనుగోలు రేసులో చేరడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే చాలా కంపెనీలు క్యాపిటల్ ఫుడ్స్ మేనేజ్మెంట్ తో సమావేశాలు నిర్వహించగా మిగిలిన కొనుగోలుదార్లు బిడ్డుకి ముందు సమావేశాన్ని నిర్వహించవచ్చని భోగట్టా.

క్యాపిటల్ ఫుడ్స్ కోసం బిడ్డింగ్ విలువ 1 బిలియన్ డాలర్ల నుంచి 1.

25 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని లెక్కగడుతున్నారు.దేశంలో ఏ కంపెనీ అమ్మకానికి వచ్చినా కొనడానికి ముందుండే రిలయన్స్ ఇండస్ట్రీస్, క్యాపిటల్ ఫుడ్స్ బిడ్స్ కి దూరంగా ఉండడం కొసమెరుపు.

ఈ కంపెనీ చెబుతున్న రేటు చాలా ఎక్కువని రిలయన్స్ భావిస్తుండడం వల్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!