పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. మరి మీ పిల్లలకు ఈ బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ను ఇస్తున్నారా?

పరీక్షలు దగ్గర పడుతున్నాయి.మార్చి నుంచి టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్ కి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి.

అయితే పరీక్షలు అంటేనే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.ఆ ఒత్తిడి వల్ల చదివింది అంత మర్చిపోతుంటారు.

పిల్లలు పరీక్షల్లో విజయవంతంగా రాణించాలంటే తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా పిల్లల డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

చదివింది గుర్తుండాలన్నా.పరీక్షల్లో రాయాలన్నా మెదడు చురుగ్గా ఉండాలి.

"""/" / అందుకే మీ పిల్లలకు బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ను ఇవ్వడం ఎంతో అవసరం.

మరి అటువంటి ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.బ్లూ బెర్రీస్( Blueberry ).

ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.ముఖ్యంగా మెదడు పనితీరును పెంచడానికి బ్లూబెర్రీస్ అత్యుత్తమంగా సహాయపడతాయి.

బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచుతాయి.

"""/" / అలాగే బ్రెయిన్ బూస్టర్ ఫుడ్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి.

వాల్ నట్స్( Walnuts ) మెదడు ఆకారంలో ఉండడమే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ వంటి పోషకాలు మీ పిల్లల బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తాయి.

కాబట్టి నిత్యం మీ పిల్లలకు నాలుగు నుంచి ఐదు నైట్ అంతా నానబెట్టిన వాల్ నట్స్ ను ఇవ్వండి.

అవకాడో ఖరీదు ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు దానిలో ఉంటాయి.అవకాడో( Avocado )లో మెండుగా ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

మరియు జ్ఞాపక శక్తిని పెంచుతాయి.పరీక్షల సమయంలో మీ పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు దృష్టిని పెంచాలి అనుకుంటే తప్పకుండా వారి చేత వారానికి ఒకసారి చేపలను తినిపించండి.

ఇక డార్క్ చాక్లెట్ కూడా బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ కోవకే చెందుతుంది.నిత్యం తగిన మోతాదులో డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఒత్తిడి టెన్షన్స్ దూరం అవుతాయి.ఏకాగ్రత పెరుగుతుంది.

మెదడు చురుగ్గా మారుతుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… గుడ్ న్యూస్ చెప్పిన నటి!