మాకు న్యాయం చేయండి సారూ…!

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సోమపంగు లక్ష్మి,సురేష్( Lakshmi, Suresh ) దంపతులు ఎలాంటి ఆధారం లేక గత పదేళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకోని జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల సురేష్ తల్లి అకాలమరణం చెందడంతో ఖర్మకాండలు నిర్వహించి,బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్లారు.

తిరిగి స్వగ్రామానికి వచ్చే వరకు తాము ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న నివాసాన్ని యల్లెంకి హరిప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమించి మాపై దౌర్జన్యం చేస్తున్నారని భాదిత కుటుంబం తమ గోడు వెళ్లబోసుకుంద.

మా గుడిసెను కూలగొట్టి ఆ ప్లాట్ లో రాతి స్తంభాలు వేసి పెన్సింగ్ చేసి మాపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారని,గ్రామంలో కొంత మందితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గడిసిన పదేళ్ళుగా తాము గుడిసె వేసుకుని జీవిస్తుంటే మమ్ములను నిరాశ్రాయులను చేశారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

వీడియో: రీల్స్ కోసం సిగరెట్ తాగింది.. ఆమె తండ్రి ఏం చేశాడో చూస్తే…