మీ పిల్లలు బలంగా తయారవ్వాలంటే ఈ ఆహారం పెట్టండి!
TeluguStop.com
నేటి దైనందిత జీవితంలో ఆహారం అనేది పెద్ద సమస్యగా మారింది.ఆహారపు ధాన్యాలకి నేడు కొరత లేనప్పటికీ కూడా కలుషితమైన ఆహారం రాజ్యమేలుతోంది.
ఆహారం కూడా వ్యాపారం అయిపోతున్న ఈరోజుల్లో మనిషికి మంచి ఆహారం దొరకడం అనేది కరువయ్యింది చెప్పుకోవాలి.
ఇలాంటి తరుణంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే ఆలోచన తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటుంది.
ఒకప్పటి రోజుల్లో చూసుకుంటే మనపెద్దలు ఇచ్చిన ఆహారాన్ని తిని పిల్లలు పుష్టిగా తయారయ్యేవారు.
కానీ నేడు మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఆహారాన్ని తిని పిల్లలు చాలా బలహీనం అయిపోతున్నారు.
"""/" /
అందుకే ఆహారం పట్ల మిక్కిలి శ్రద్ధ వహించడం అవసరం.ఎలాంటి న్యూట్రియన్స్ లేని ఫుడ్ ఇవ్వడం వలన ఎలాంటి ఫలితమూ వుండడము.
పూర్వం సాధారణంగా ప్రతిఒక్కరూ తాగే అంబలినే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తూన్నారు.
అలాంటి వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం.ఇందులో మొదటగా 'చద్దన్నం( Fermented Rice )' గురించి చెప్పుకోవాలి.
పిల్లలకు అల్పాహారంగా చద్దన్నం పెట్టడం వల్ల, అందులోని విటమిన్ 'సి' వారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రాత్రిపూట వండుకున్న అన్నంలో గంజి పోసి అలా వదిలేసి పొద్దున్నే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలిపి పిల్లలకు తినిపించడం వలన వారికి ఎక్కువ శక్తి లభిస్తుంది.
"""/" /
తరువాత 'జొన్న అంబలి(Jonna AmbalIi )' గురించి చెప్పుకోవాలి.చిరుధాన్యాలలో ఒకటైన జొన్నలను పిండిగా చేసుకొని, అంబలి చేసి పిల్లలకు పెట్టడం వలన అందులోని ఐరన్, క్యాల్షియం పిల్లలు స్ట్రాంగ్ కావడానికి దోహద పడుతుంది.
ఆ తరువాత 'రాగిఅంబలి' గురించి అందరికీ తెలిసిందే. """/" /
రాగిపిండితో తయారు చేసే అంబలిని ఆరు నెలలు నిండిన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన ఆరోగ్యంగా వుంటారు.
ఇంకా ఇందులోని ఐరన్, క్యాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం అధిక బలాన్ని అందిస్తాయి.
నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..