సూర్యాపేట జిల్లా: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పిఎసిఎస్ కు చెందిన రెండు ఎకరాల స్థలంలో రైతుల సౌకర్యార్థం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయుటకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు మంగళవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో నల్గొండ డిసిసిబి చైర్మన్,
టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
నాబార్డు ద్వారా రుణాన్ని మంజూరు చేసి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు.
కోదాడ పరిసర ప్రాంతాల్లోఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లేనందున గుడిబండలో నిర్మిస్తే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, గురువారం 2025