ఒక్కసారి అవకాశం ఇవ్వండి మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా : చల్మెడ లక్ష్మీ నరసింహా రావు

24గంటలు కరెంట్ ఇచ్చే బిఆర్ఎస్ కావాలా.?అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నాఒక్కసారి అవకాశం ఇవ్వండి మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాబిఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డితో కలిసి కథలపూర్ మండలంలోని తాండ్రియాల, అంబారిపేట, తుర్తి, పోసానిపేట, ఇప్పపల్లి, పోతారం, కలికోట గ్రామాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే, గెలిచిన మూడేళ్ళ లోపు కథలపూర్ మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని బిఅర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ( Chalmeda Lakshmi Narasimha Rao )అన్నారు.

కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, మన బ్రతుకులు మరాలన్నా మళ్ళీ ఒకసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 3గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారని, మరి 24గంటలు కరెంట్ ఇచ్చే బి.

ఆర్.ఎస్ ప్రభుత్వం కావాలా.

? 3గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని, మొన్నటికి మొన్న రైతు బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాడని, ఇది రైతుల పొట్ట కొట్టే విధానం కదా అంటూ ప్రశ్నించారు.

అందుకే రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ అందరికి అందాలన్న బి.

ఆర్.ఎస్ పార్టీకి( BRS Party ) మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వాలని సూచించారు.

కథలాపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, గెలిచిన మూడేళ్లలో మండలంలోని అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

అంతకు ముందు ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడకు గ్రామంలోని మహిళలు యువకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు ఆడుతూ, బోనాలతో ఒగ్గుడోలు కళాకారులు ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు.

తాండ్రియాల గ్రామంలో గూండ్ల కులస్తుల అద్వర్యం లో సంప్రదాయ పద్దతిలో చేపల వలలతో, మహిళలు బోనాలతో పలికిన స్వాగతం ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఆయా గ్రామాల పర్యటనలకు వెళ్లిన చల్మెడ సమక్షంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పలు కుల సంఘాల సభ్యులు రాబోయే ఎన్నికల్లో చల్మెడకే సంపూర్ణ మద్దతు తెలుపుతామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అట్లాగే కథలపూర్ మండల కేంద్రానికి చెందిన గౌడ కులస్తులు చల్మెడకు మద్దతు తెలుపుతామంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో .బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంకథలపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ఒద్దినేని హరిచరణ్ రావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుల చేతులమీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి-గణేష్, వైస్ ఎంపిపి గండ్ర కిరణ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రావు, బి.

ఆర్.ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడిలా గంగా ప్రసాద్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు చీటి విద్యా సాగర్ రావు, రైతు సంఘం అధ్యక్షుడు గడ్డం భూమా రెడ్డి, నాయకులు గుండారపు గంగాధర్, దొప్పల జలందర్ తదితరులు పాల్గొన్నారు.

రాజా రవీంద్ర “శ్రీ వీర ప్రతాప 1940” సెప్టెంబర్ 12న థియేటర్స్ లో విడుదల !!!