తాటిచెట్టు పైనుండి జారీ గీత కార్మికుడి మృతి

యాదాద్రిభువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోయపల్లి మల్లయ్య గౌడ్ ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి జారి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్,రామన్నపేట మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, తెలియచేశారు.

వారికి గీత పనివారల సంఘం రామన్నపేట మండల కమిటీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ అధికారులు ( Excise Officers )వెంటనే స్పందించి అతని కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎక్సిగ్రేషియాను మంజూరు చేయాలని కోరారు.

సంతాపం తెలియచేసిన వారిలో బాలగోని మల్లయ్య,వీరమళ్ళ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ట్రోల్ చేయకండి అంటూ?