తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

నల్లగొండ జిల్లా: మునుగోడు మండలం( Munugodu ) ఊకొండి గ్రామానికి చెందిన నకిరేకంటి అంజయ్య (58) తన వ్యవసాయ భూమిలో ఉదయం ఏడున్నర గంటలకు తాటి చెట్టు ఎక్కి కల్లు తీసుకొని దిగుతుండగా తన మోకు గొలుసు తెగి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు,108 కు సమాచారం ఇచ్చారు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతనిని 108 అంబులెన్స్ లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు హైదరాబాద్ కు రెఫర్ చేయగా హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.

మృతిని కుమారుడు నకిరేకంటి శ్రీను ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అలాంటి కామెంట్లు చేయడం రైటేనా నాగ్ అశ్విన్.. ఎవరి టాలెంట్ వారిదని గుర్తించాలంటూ?