గీతా గోపినాథ్‌ని మళ్లీ పిలిపించిన ఐఎంఎఫ్.. ఈ సారి ఏకంగా నెంబర్. 2 బాధ్యతలు
TeluguStop.com
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకానమిస్ట్‌గా పనిచేసిన ఇండో అమెరికన్ ఆర్ధికవేత్త గీతా గోపినాథ్ ఇప్పుడు అదే సంస్థలో కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు.
ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరక్టెర్‌గా ఆమె ప్రమోషన్ పొందారు.తద్వారా ఈ పదవిని పొందిన తొలి భారతీయురాలిగా గీతా గోపినాథ్ రికార్డుల్లోకెక్కారు.
ప్రస్తుతం డిప్యూటీ ఎండీ పదవిలో వున్న జెఫ్రీ ఒకమోటో వచ్చే ఏడాది రిటైర్ కానున్నారు.
ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న గీతా గోపినాథ్ అక్టోంబర్ లో ఆ పదవిని వీడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్రం విభాగంలో పనిచేస్తున్న ఆమె.ఏడాది పాటు సెలవుపై వచ్చి.
ఐఎంఎఫ్‌లో మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో పరిశోధనా విభాగానికి అధిపతిగా ఉన్న ఆమె ఆధ్వర్యంలోనే వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలు తయారయ్యేవి.
అప్పటి వరకు ఐఎంఎఫ్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన మౌరీ ఆస్టెఫెల్డ్ 2018 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు.
దీంతో 2018 అక్టోంబర్‌లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితులైన గీతా గోపీనాథ్.2019 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు.
గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌కు అద్భుత బాధ్యతల్ని నిర్వర్తించారని, తన నాయకత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ రూపాన్ని ఇచ్చారని, ఆర్థిక సంక్షోభం వేళ ఆమె చక్కటి ప్రణాళికలు వేసినట్లు జార్జీవా ప్రశంసించారు.
భారత్‌లో పుట్టి పెరిగిన గీతా గోపీనాథ్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.కోల్‌కత్తలో పుట్టిన ఈమె కర్ణాటకలోని మైసూరులో పెరిగారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ .ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు.
అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
2005లో ప్రతిష్టాత్మక హార్వర్డ్‌కు వెళ్లారు. """/" /
గీతా గోపీనాథ్ 2016లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు.
అయితే ఈ నియామకం వివాదాస్పదమైంది.కాగా గీతా గోపీనాథ్.
ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు.
ఆర్ధిక శాస్త్రానికి అసమాన సేవలు చేసిన గీతా గోపీనాథ్ ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు.
2014లో ఐఎంఎఫ్ గుర్తించిన 45 అగ్రశ్రేణీ ఆర్థికవేత్తల్లో గీతా 25వ ర్యాంక్ పొందారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2011లో గీతను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది.
సౌందర్యది సహజ మరణం కాదా… కుట్ర జరిగిందా.. ఆ టాలీవుడ్ హీరో హస్తం ఉందా?