ఆడపిల్లలు చదువుతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

సూర్యాపేట జిల్లా:ప్రతీ ఒక్క ఆడపిల్ల ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటక్షన్ అధికారి షేక్ మీరా అన్నారు.

సూర్యాపేట జిల్లా( Suryapet District ) నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలోబాల రక్ష భవన్ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినిలకు "విద్యార్ది దశలో ఆలోచన విధానం-విద్యార్థి పాత్ర' పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రావాలని,ప్రతి ఒక్కరూ భవిష్యత్తుపై లక్ష్యంతో చదువుకోవాలని,ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా,భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించేందుకు ఇష్టంతో కష్టపడి చదువుతూ వారికి మంచి పేరు తేవాలని,అప్పుడు మాత్రమే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత పూర్తిస్థాయిలో నిర్వహించినట్టు అవుతుందన్నారు.

పాఠశాల దశలో విద్యార్థి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.

పాఠశాల దశలో పిల్లలు తీసుకునే నిర్ణయాలే వారి జీవితానికి పునాదుల్లా ఉంటాయన్నారు.బాల రక్ష భవన్ అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి బాగా చదువులో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకు రావాలని కోరారు.

విద్యార్థినులకు సేఫ్ టచ్-అన్ సేఫ్ టచ్ గురించి వివరించగా,చైల్డ్ లైన్ అధికారి బి.

వంశీ చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెం:1098 గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కేజీబివి ఉపాధ్యాయురాళ్ళు పి.

అనిత,ఊర్మిళ,గంగభవాని,దుర్గ,శైలజ,కనిష్ ఫాతిమా మరియు బాల రక్ష భవన్ అధికారులు బి.వంశి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్7, శనివారం 2024