బాలికలకు రక్షణ కల్పించాలి

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి బాలికలకు రక్షణ కల్పించాలని పి.

డి.ఎస్.

యు.జిల్లా అధ్యక్షకార్యదర్శులు పుల్లూరు సింహాద్రి, ఎర్ర అఖిల్ డిమాండ్ చేశారు.

శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించి కోర్టు చౌరస్తా వద్ద బాలికలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం బాలికలకు హాస్టల్ నిర్మించి,చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయకుండా వదిలేశారని,దీనివల్ల బాలికలకు రక్షణతో పాటు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్ ప్రక్కనే ప్రభుత్వ జూనియర్ బాయ్స్ కాలేజ్ ఉండడంతో పాటు,సాయంత్రం వేళ ఆకతాయిలు తాగి వచ్చి అమ్మాయిల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనితో పాటు అక్కడే ఓపెన్ జీమ్ ఉండడం వలన అనేకమంది జిమ్ కి రావడం వల్ల బాలికలు అసహనానికి గురవుతున్నారని, ఇప్పటికే సమాజంలో బాలికలు,మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భాల్లో బాలికలు ఉండే హాస్టల్ కు ప్రహరీ గోడలు లేకుండా గాలికి వదిలేయడం ప్రభుత్వ అధికారుల చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఇకనైనా జిల్లా మంత్రి స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసి, యుద్ధ ప్రాతిపదికన ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు.

లేనియెడల పి.డి.

ఎస్.యు.

ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు రేఖ,మాధవి,మౌనిక, స్వాతి,మహేశ్వరి, అనుష,వసుంధర తదితరులు పాల్గొన్నారు.

వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి..?