కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు ఆత్మహత్య
TeluguStop.com
తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని భావింస్తుంటారు.
ఈ క్రమంలోనే పిల్లల పెళ్లి విషయంలో కూడా ఎన్నో రకాలుగా ఆలోచించి తమకంటే గొప్పగా ఉన్నవారి ఇంటికి పంపించాలనుకుంటారు.
అదే భావించి పిల్ల పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులకు చేదు విషయం తెలిసింది.
దీనితో కట్టుకున్న వాడు చేసిన మోసం గురించి తెలుసుకున్న ఒక నవ వధువు పెళ్లి శుభలేఖ పైనే సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.సూర్యాపేట ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్‌కు చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నాడు.
అతనికి ఇద్దరు కూతుళ్లు.పెద్ద కూతురు మౌనిక(24) సీఏ పూర్తి చేసి, మంచి ప్యాకేజీతో జాబ్ చేస్తోంది.
మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు.ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన సాయికిరణ్ రెడ్డి.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, ఘట్‌కేసర్ దగ్గర ఐదెకరాల భూమి ఉందని నమ్మించాడు.
దీంతో.మంచి సంబంధమని నమ్మిన వధువు తల్లిదండ్రులు అతడితో ఈ నెల 15న సూర్యాపేటలో ఘనంగా వివాహం జరిపించారు.
కట్నకానుకల కింద రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారం, 4 కిలోల వెండి కూడా అప్పజెప్పారు.
అయితే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం అని భావించి మొదటిసారి కూతురు ఇంటికి వెళ్లగా అక్కడ వారికి నమ్మలేని నిజం ఒకటి తెలిసింది.
సాయి కిరణ్ రెడ్డికి జాబ్ లేదని, భూమి కూడా లేదని తెలిసి వారు నిర్ఘాంతపోయారు.
దీంతో.వరుడి బంధువులను నిలదీశారు.
కానీ వారికి అవమానమే ఎదురైంది.మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులను మెట్టినింటి వాళ్లు దాడి చేసి, ఇంట్లోంచి గెంటేశారు.
ఇష్టం లేకపోతే మీ బిడ్డను కూడా తీసుకొని వెళ్లిపోండని అనడంతో.మౌనిక, ఆమె తల్లిదండ్రులు సూర్యాపేటకు వెళ్లిపోయారు.
అయితే.తనకు జరిగిన మోసం, మెట్టినింటి వారి ప్రవర్తనతో మనస్తాపానికి గురైన మౌనిక.
తన పెళ్లి కార్డుపైనే సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే ఆదివారం మౌనిక గదిలో నుంచి బయటకు రాకపోవడం తో కిటికీ లోనుంచి కుటుంబసభ్యులు చూడడం తో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
దీనితో వెంటనే తలుపు బద్దలు కొట్టి ఇరుగుపొరుగు వారి సాయంతో లోపలి వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
అప్పటికే మౌనిక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025