వైరల్ వీడియో: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. కాకపోతే అలా ఫేమస్ అయ్యింది..

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం వివిధ రకాల స్టెంట్స్ చేయడం, వారిలోనే టాలెంట్ లని ప్రపంచానికి చూపిస్తూ ప్రశంసలు పొందాలని ప్రయత్నిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఇందుకోసం ఎలాంటి సాహసాలు చేయడానికి అయినా వెనకాడరన్న సంఘటనలు చాలానే చూసాం.ఇక మరికొందరైతే.

వాన, ఎండ అని తేడా లేకుండా రీల్స్, ఫోటోలు అంటూ విచిత్ర సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు.

"""/" / అయితే తాజాగా ఒక యువతికి కూడా అలాంటి షాపింగ్ సంఘటన ఎదురయింది.

వర్షంలో డాన్స్ చేసి రీల్ చేయాలని అనుకున్న కానీ.అంతలోపే అనుకోని సంఘటన జరిగింది.

అసలు విషయానికి వస్తే.బీహార్ కు( Bihar ) చెందిన ఒక యువతి వర్షం కురుస్తున్న సమయంలో రీల్ చేసే కోసం ఇంటి పైకి వెళ్ళింది.

ఇంటి పైకి వెళ్లిన అనంతరం ఫోన్లో కెమెరా ఆన్ పెట్టి వర్షంలోకి వెళ్ళింది.

తీరా డాన్స్( Dance ) చెయ్యాలని భావించిన సమయంలో ఆమెకు కాస్త దూరంలో ఉన్న కొద్ది దూరంలో పిడుగు( Lightning Strike ) పడి గట్టిగా సౌండ్ వచ్చింది.

"""/" / ఆ శబ్దానికి సదరు యువతి చెవులు మూసుకుని ఇంట్లోకి పరిగెత్తడం మనం గమనించవచ్చు.

ఈ సంఘటన మొత్తం ఫోన్ కెమెరాలో రికార్డు అవ్వడం ఆ వీడియోలో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

అంత పెద్ద పిడుగు పడినా కానీ.ఆ యువతికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ముందుగా ఇంట్లోకి వెళ్లి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో అని, యువరాజు వేరే పనిలో బిజీగా ఉన్నాడంటూ ఇంకోసారి ఇలా చేయొద్దు అంటూ వరునుడు వార్నింగ్ ఇచ్చాడు అంటూ, వర్షాకాలంలో ఇలాంటి తప్పులు ఎవరు చేయవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ వీడియో: అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్‌