ఘోరం: ప్రేమించలేదని యువతిని దారుణంగా....
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న టువంటి ఆకృత్యాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.తాజాగా ఓ యువకుడు తన ప్రేమకు ఒప్పుకోలేదని ఏకంగా ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దారుణంగా దాడి చేసి హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తే ఇక రాష్ట్రంలోని కరీంనగర్ పట్టనంలో రాధిక అనే బాలిక తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది.
అయితే రాధిక స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
ఈ క్రమంలో ఆమెని రోజు కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో ప్రేమిస్తున్నానని వెంట పడుతూ ఉండేవాడు.
అయితే రాధిక మాత్రం తనకు ఈ ప్రేమ ఇష్టం లేదని తాను బాగా చదువుకొని తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యువకుడితో చెబుతుండేది.
"""/"/
అయితే తాజాగా రాధికను ఆ యువకుడు మరోసారి ప్రేమించాలని వేధించాడు.దీంతో ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాధిక ఇంటికి వెళ్లి ఆమెను దారుణంగా కత్తితో గాయపరిచి హత్య చేశాడు.
పని నిమిత్తం బయటకెళ్ళినటువంటి రాధిక తల్లిదండ్రులు పని ముగించుకొని ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా రాధిక మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు.
అయితే చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సుమ బండారం బయటపెట్టిన యాంకర్…. సుమ పరువు మొత్తం పోయిందిగా?