మొబైల్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న బాలిక !
TeluguStop.com
నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ ఫోన్లకు బానిస అవుతున్నారు.
ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్ లోనే గుడుపుతున్నారు.ఆన్ లైన్ గేమ్ లు, సినిమాలు, సోషల్ మీడియాలో ఉంటున్నారు.
నేటితరం పిల్లలు ఈ విషయాల్లో మొండిగా ఉంటూ క్షణికావేశంతో వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.
చిన్నప్పటి నుంచి పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు పుట్టేడు దుఃఖం మిగిల్చి పోతున్నారు.
సెల్ ఫోన్ అడిగితే తల్లి ఇవ్వనందుకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన కరీనంగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కరీంనగర్ జిల్లాలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో రజిత అనే మహిళ నివాసముంటుంది.
రజిత భర్త సుధాకర్ కొన్నేళ్ల కిందట చనిపోయాడు.రజిత, సుధాకర్ కి అప్పటికే సింధుజ పుట్టింది.
భర్త మరణంతో రజిత రవికిరణ్ అనే వ్యక్తితో రెండో పెళ్లి చేసుకుంది.సింధుజ కూడా తన తల్లితో కలిసి కృష్ణానగర్‌లో ఉంటోంది.
సింధుజ ఇప్పుడు పదో తరగతి చదువుతుంది.ఆమెకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభంకావడంతో తల్లి రజిత సెల్ ఫోన్ లో సింధుజ ఆన్ లైన్ లో క్లాసులు వింటుంది.
అయితే సింధుజ ఫోన్ కొనియ్యమని తల్లిని అడగటంతో అందుకు రజిత ఒప్పుకోలేదు.దీంతో మనస్తాపాకానికి గురైన సింధుజ ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన తల్లి విగతజీవిగా ఉరికొయ్యలకు వేలాడుతున్న సింధుజ కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బన్నీ ప్రచార యావే ప్రాణం తీసింది.. మానవ హక్కుల కమిషన్ కు బన్నీపై ఫిర్యాదు!