అమావాస్య రోజు అమ్మాయి పుడితే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే కొన్ని పనులు చేయడానికి అమావాస్య , పౌర్ణమి ఎంతో మంచిదని భావించిన వారు కొన్ని పనులకు అమావాస్య పౌర్ణమి మంచిది కాదని భావిస్తుంటారు.

అయితే కొన్ని చోట్ల అమావాస్య పౌర్ణమి లను ఎంతో ప్రత్యేకమైన దినాలుగా పరి గణించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని కొంత మంది బాధ పడుతుంటారు.

నిజానికి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఏ విధమైనటు వంటి పరిణామాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

అమావాస్యను ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు.సాక్షాత్తు మహాలక్ష్మి కూడా అమావాస్య రోజున పుట్టిందని విశ్వసించటంతో అమావాస్య రోజు అమ్మాయి పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టింది అని భావించాలి.

అమావాస్య రోజు అమ్మాయి పుడితే తల్లి తండ్రికి చిన్న పాటి దోషాలు ఉన్నప్పటికీ, వాటిని పరిహారం చేయించుకుంటే వారి జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది.

ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే తనని ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తారు.అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల మొహం కూడా ఎంతో అందంగా నిగ నిగ లాడుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.

"""/" / అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల యోగం అద్భుతంగా ఉంటుంది.అయితే ఈ రోజు పుట్టిన అమ్మాయి నోటి నుంచి ఎప్పుడూ కూడా అపశకునం రాకూడదని తను పలికే మాటలు చాలా నిజమవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

కనుక వీలైనంత వరకు అమావాస్య రోజు పుట్టిన వారు మంచిని కోరుకోవడంతో మంచే జరుగుతుంది.

ఈ రోజు పుట్టిన అమ్మాయికి వివాహం తర్వాత భర్తతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తుతాయని అయితే వాటిని పాజిటివ్ గా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఈ సందర్భంగా పండితులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా వీరు ఏ పని చేయాలన్నా లేదా నూతన వస్తువులను కొనుగోలు చేయాలన్నా పౌర్ణమి తర్వాత కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమని అలా చేసినప్పుడే ఎంతో అద్భుతంగా ముందుకు రాగలరని పండితులు చెబుతున్నారు.

ఆ దర్శకునికి చనువు ఇస్తే ఏం చేస్తాడో బాగా తెలుసు.. యాంకర్ వింధ్య ఏమన్నారంటే?