జిన్నా మూవీ నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలివే.. ఎన్ని రూ.లక్షలంటే?

మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన జిన్నా సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

జిన్నా సినిమా విడుదలైన తర్వాత కూడా క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

వన్ టైమ్ వాచబుల్ మూవీ అంటూ క్రిటిక్స్ జిన్నా సినిమా విషయంలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

అయితే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేవు.జిన్నా మూవీ దీపావళి పండుగ సెలవులను క్యాష్ చేసుకుంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది.

జిన్నా మూవీ నాలుగు రోజుల్లో కేవలం 41 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన వాళ్లకు భారీ స్థాయిలో నష్టాలు తప్పవని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

జిన్నా మూవీ ఫుల్ రన్ లో కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం కూడా కష్టమేనని తెలుస్తోంది.

ఇతర భాషల హీరోల సినిమాల కంటే జిన్నా సినిమాకే తక్కువగా కలెక్షన్లు రావడం గమనార్హం.

మంచు హీరోలకు ఈ మధ్య కాలంలో సినిమాలు కలిసిరావడం లేదు.కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా మంచు హీరోల సినిమాలకు కలెక్షన్లు తగ్గుతున్నాయి.

ఇదంతా స్వయంకృతాపరాధం అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం . """/"/ మంచు హీరోల తర్వాత సినిమాలు అయినా సక్సెస్ సాధిస్తాయేమో చూడాల్సి ఉంది.

మంచు విష్ణు తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.నెగిటివిటీ తగ్గే వరకు మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకుండా ఉంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు.

మంచి టెక్నీషియన్లు పని చేసినా జిన్నా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

నా భార్యకు తల్లీతండ్రి అన్నీ తానే.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!