అల్లంతో చుండ్రుకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

చుండ్రు.ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

చుండ్రు స‌మ‌స్య వ‌చ్చింది అంటే.తలలో దురద, చికాకు, చర్మం పొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, తలలో మొటిమలు ఇలా అనేక స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడ‌తాయి.

మ‌రియు చుండ్రు స‌మ‌స్య ఉన్న వారు.న‌లుగురిలోకి రావ‌డానికి కాస్త జంకుతుంటారు.

అయితే చుండ్రును పోగొట్టేందుకు ప్ర‌స్తుతం మార్కెట్‌లో ర‌క‌ర‌కాల షాంపూలు, నూనెలు ఉన్న‌ప్ప‌టికీ.ఇవి తాత్కాలికంగానే ప‌రిష్కారాన్ని ఇస్తారు.

కానీ, కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ఫాలో అయితే శాశ్వ‌తంగా చుండ్రు స‌మ‌స్య‌కు దూరంగా ఉండొవ‌చ్చు.

ముఖ్యంగా మ‌రి ప్ర‌తి రోజు విరి విరిగా ఉప‌యోగించే అల్లం.చుండ్రును నివారించ‌డంతో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

మ‌రి అల్లాన్ని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా.

చిన్న అల్లం ముక్క తీసుకుని.తొక్క తీసి శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు ఆ అల్లం ముక్క‌ను కాస్త క్ర‌ష్ చేసుకుని.నువ్వల నూనెలో వేసుకుని ఏడు లేదా ఎనిమిది గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

"""/" / .ఈ నూనెను రాత్రి ప‌డుకునే ముందు త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి.

ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.

చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.అలాగే అల్లాన్ని తొక్క తీసి.

మొత్త‌గా పేస్ట్ చేసుకుని ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి.

త‌ల‌కు ప‌ట్టించాలి.అర‌గంట లేదా గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేసినా.చుండ్రు త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఇక ఇప్పుడు చెప్పుకున్న చిట్కాల‌తో పాటు.మ‌రి కొన్ని జాగ్ర‌త్త‌లు కూడా పాటిస్తే చుండ్రుకు మ‌రింత ఫాస్ట్‌గా చెక్ పెట్ట‌వ‌చ్చు.

సాధార‌ణంగా కేశాల‌కు ఏవేవో నూనెలు రాస్తారు.కానీ, స్వ‌చ్ఛ‌మైన కొబ్బ‌రి నూనె రాసుకుంటే.

చుండ్ర త‌గ్గ‌డమే కాదు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు.

కానీ, ఎవ‌రి దువ్వెన‌తో వారే దువ్వుకోవాలి.జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్‌, షుగ‌ర్ ఫుడ్స్‌, మ‌ద్యం ఇలాంటివి తీసుకున్నా చుండ్రు స‌మ‌స్య వేధిస్తుంది.

కాబ‌ట్టి, వీటికి దూరంగా ఉండాలి.మ‌రియు వారానికి రెండు సార్లు త‌ల‌స్నానం చేయాలి.

ట్రంప్‌ గెలుపు బైడెన్‌కు ముందే తెలుసా? కమలను ముంచేశారా? .. ఒబామా సన్నిహితుడి వ్యాఖ్యలు