యువకుల కోరిక మేరకు గ్రామానికి దోమల ఫాగ్ మిషన్ బహుకరణ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం ( Garidepalli )ఎల్బీనగర్ గ్రామంలో దోమల బెడదతో ప్రజలు విషజ్వరాల బారినపడ్డారు.

దీనిని గ్రామ యువకులు బోధ సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన, ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదని భావించి సొంత ఖర్చులతో దోమల నివారణకు ఫాగ్ మిషన్ తెచ్చి,మంగళవారం గ్రామ కార్యదర్శి బొలిషెట్టి నాగేంద్రబాబుకు అందజేశారు.

ఫాగ్ మిషన్( Fog Mission ) బహుకరణతో బోధ సైడిరెడ్డికి యువకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నలబోలు సక్కుభయమ్మ, నారాయణరెడ్డి,బోధ సైదిరెడ్డి, అన్నె మోహన్ రావు,మాజీ ఎంపీటీసీ తాటికొండ భూపాల్ రెడ్డి,బోధ శ్రీనివాసరెడ్డి, కొప్పిశెట్టి సత్యనారాయణ, కేతిరెడ్డి వీరారెడ్డి,పిల్లి అంజయ్య,గంట వీరభద్రి, కొప్పిశెట్టి శ్రీను,ఏఎన్ఎం విజయ,ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి,ఆశ వర్కర్ వెంకటమ్మ,సురభి వీరబాబు, కొప్పిశెట్టి వాసు,బండ్ల సైదిరెడ్డి, కందుల నాగిరెడ్డి పాల్గొన్నారు.

గోపీచంద్ విశ్వం మూవీ ట్విట్టర్ రివ్యూ.. మ్యాచో స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారా?